RRR Movie Update: "ఆర్ఆర్ఆర్" చిత్రాన్ని వాయిదా వేయనున్న చిత్రబృందం.!?

admin1
Updated on: 13 Aug 2021 1:45 PM IST
Director Rajamouli Planning to Postpone RRR Movie Again
X

ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

RRR Movie Update: తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్". రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆలియా భట్, సముతిరఖని, అజయ్ దేవగన్ వంటి స్టార్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన విడుదల కాబోతున్నట్టు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది.

ఈ సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ తో చిత్రబృందం బిజీగా ఉంది. నిజానికి ఈ పాట షూటింగ్ నిన్ననే పూర్తి కావాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడటంతో చిత్ర బృందం మరొక వారం పాటు ఉక్రెయిన్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక షాకింగ్ వార్త అభిమానులను కలవర పెడుతోంది. ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చాక రాజమౌళి ఒక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి అందులో సినిమాకి సంబంధించిన కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు అని తెలుస్తోంది.

admin1

admin1

Next Story