మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్యరాయ్

*మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్యరాయ్

Rama Rao
Updated on: 13 Jun 2022 6:00 PM IST
Director Rajamouli is Trying for Aishwarya Rai Dates | Tollywood News
X

మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్యరాయ్

Aishwarya Rai: ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్యరాయ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మీడియాకి కనిపిస్తున్నా లేకపోయినా సినిమాలు చేస్తున్న చేయకపోయినా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా తన కూతురు ఆరాధ్య ఆలనాపాలనా చూసుకోవడం పైన దృష్టి పెట్టిన ఐశ్వర్యరాయ్ తాజాగా ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఎప్పటికప్పుడు స్టార్ డైరెక్టర్లు ఐశ్వర్యరాయ్ కి సినిమా కథలు వినిపిస్తూనే ఉంటారు. ఈ జాబితాలో సన్ పిక్చర్స్ కూడా ఉన్నట్లు సమాచారం.సన్ పిక్చర్స్ వారు రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమాలో ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా నటిస్తే బాగుంటుందని ఆమెను సంప్రదించి భారీగానే పారితోషికం ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

ఇక మరో వైపు టాలీవుడ్ నుంచి స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా తన తదుపరి సినిమా కోసం ఐశ్వర్యరాయ్ నే ఎంపిక చేయాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో ఐశ్వర్య రాయ్ ను ఒక కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Rama Rao

Rama Rao

Next Story