తనికెళ్ళ భరణి దర్శకత్వంలో రాఘవేంద్రరావు సినిమా?

తనికెళ్ళ భరణి దర్శకత్వంలో రాఘవేంద్రరావు సినిమా?
x
Highlights

సందేశాత్మక, భక్తీ రస చిత్రం కాకుండా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్ లు నటించనున్నారట. వారిలో ముగ్గురు హీరోయిన్లు ఇప్పటి వరకు ఫైనల్ అయినట్టుగా సమాచారం.

100కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించి చాలా మంది హీరోలకి స్టార్ హోదా తెచ్చారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అయితే ఇప్పుడాయన ప్రధాన పాత్రలలో ఓ సినిమా తెరకేక్కబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. రాఘవేంద్రరావు చుట్టూ తిరిగే ఓ స్టోరీలో ఆయన ముఖ్యపాత్ర పోషిస్తున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాకి తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

సందేశాత్మక, భక్తీ రస చిత్రం కాకుండా పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్ లు నటించనున్నారట. వారిలో ముగ్గురు హీరోయిన్లు ఇప్పటి వరకు ఫైనల్ అయినట్టుగా సమాచారం. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, శ్రియ, సమంతలు ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. ఇక మరో హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

ప్రస్తుతం రాఘవేంద్రరావు పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆఫీషియల్ గా అనౌన్స్ ఇచ్చారు రాఘవేంద్రరావు. ఇందులో హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని ఆర్.కె ఫిలిం అసిసియేషన్ బ్యానర్, ఆర్కా మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories