Raghavendra Rao: హీరోగా మారిపోయిన దర్శకేంద్రుడు

* హీరోగా రెండు సినిమాలు సైన్ చేసిన స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు

admin1
Updated on: 7 Oct 2021 6:08 PM IST
Director Raghavendra Rao Signed Two Movies as Hero in Tollywood
X

రాఘవేంద్రరావు (ట్విట్టర్ ఫోటో)

Raghavendra Rao: టాలీవుడ్ లో ఉన్న లెజెండరీ దర్శకులలో రాఘవేంద్రరావు కూడా ఒకరు. దర్శకేంద్రుడు అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే రాఘవేంద్రరావు ఇప్పటికే బోలెడు బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. అయితే గత కొంత కాలంగా రాఘవేంద్రరావు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సినిమాల నుంచి రిటైర్ మెంట్ తీసుకున్నారు అంటూ కొన్ని పుకార్లు కూడా పుట్టుకు వచ్చాయి. కానీ పెళ్లి సందడి సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రాఘవేంద్రరావు. అయితే ఒకవైపు దర్శకత్వం మాత్రమే కాక మరో వైపు నటనపై దృష్టి సారించారు రాఘవేంద్ర రావు.

"పెళ్లిసందడి" సినిమా లో గెస్ట్ పాత్ర పోషిస్తున్న రాఘవేంద్రరావు హీరోగా ఇప్పుడు తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ పూర్తయిపోయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే మరో వైపు రాఘవేంద్రరావు హీరోగా వీ.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో కూడా ఒక సినిమా సైన్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

అయితే తనికెళ్ల భరణి తో సినిమా పూర్తయిన తర్వాత రాఘవేంద్ర వీ.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. "నమో వెంకటేశ" సినిమా తరువాత రాఘవేంద్రరావు ఏ సినిమాకి దర్శకత్వం వహించింది లేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా రాఘవేంద్రరావు ఇప్పుడు హీరోగా మారిపోయి అందరినీ ఆకట్టుకుంటున్నారు.

admin1

admin1

Next Story