Puri Jagannadh - Chiru: చిరు సినిమా కోసం ముందుకు వచ్చిన పూరి జగన్నాథ్

* చిరంజీవి హీరోగా నటిస్తున్న ఒక సినిమాకి పూరి తన వంతు సహాయాన్ని అందించబోతున్నారని సమాచారం

Sandeep Reddy
Updated on: 2 Oct 2021 6:30 PM IST
Director Puri Jagannadh Helps to Chiranjeevi God Father Movie Script
X

చిరు సినిమా కోసం ముందుకు వచ్చిన పూరి జగన్నాథ్ (ఫైల్ ఫోటో)

Puri Jagannadh - Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయాలనేది పూరి జగన్నాథ్ కల. నిజానికి చిరంజీవి 150వ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాలని అనుకున్నారు కానీ ఆ సినిమా అవకాశాన్ని కోల్పోయారు పూరి. అప్పటి నుంచి చిరుతో సినిమా కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న ఒక సినిమాకి పూరి తన వంతు సహాయాన్ని అందించబోతున్నారట. వివరాల్లోకి వెళితే మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాని ఇప్పుడు తెలుగులో చిరంజీవి హీరోగా "గాడ్ ఫాదర్" అనే టైటిల్ తో విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.

సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా చిరంజీవికి సెట్ అయ్యే విధంగా ఈ కథలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమా విషయంలో కొన్ని సలహాలు ఇస్తున్నారట. పూరి సలహాలకు అనుగుణంగా స్క్రిప్ట్ మారుస్తున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ మాస్ సినిమాలకి పెట్టింది పేరు. "గాడ్ ఫాదర్" సినిమాలో చిరంజీవిని కూడా అలాంటి మాస్ అవతారం లోనే చూపించబోతున్నారు అని తెలుస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story