Nagarjuna New Movie: కాజల్ స్థానంలో మరొకరిని రంగంలోకి దింపనున్న దర్శక నిర్మాతలు

* గత కొద్ది రోజులుగా కాజల్ అగర్వాల్ గర్భవతి అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే

admin1
Updated on: 8 Oct 2021 6:03 PM IST
Director Praveen Sattaru Searching for a Heroine in Place of Kajal Aggarwal in Nagarjuna New Movie
X

కాజల్ స్థానంలో మరొకరిని రంగంలోకి దింపనున్న దర్శక నిర్మాతలు (ఫోటో-ది హన్స్ ఇండియా)

Nagarjuna New Movie: ఈ మధ్యనే "వైల్డ్ డాగ్" సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ తోనే అభిమానులను ఇంప్రెస్ చేసిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు దర్శక నిర్మాతలు కాజల్ స్థానంలో మరొక హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారట.

స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తోంది. గత కొద్ది రోజులుగా కాజల్ అగర్వాల్ గర్భవతి అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది గౌతమ్ కిచ్లు తో వివాహం చేసుకున్న కాజల్ ఇప్పుడు తన మొదటి బిడ్డకు జన్మనివ్వనుందని తెలుస్తోంది. అందుకే కాజల్ స్థానంలో ఇప్పుడు మరొక హీరోయిన్ ని రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నాగార్జున "బంగార్రాజు" సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమాలో హీరోయిన్గా కనిపించనుంది.

admin1

admin1

Next Story