Prabhas - Salaar Movie: హాలీవుడ్ టెక్నాలజీతో రాబోతున్న ప్రభాస్ "సలార్"

Director Prashanth Neel Using Dark Centric Theme Technology in Prabhas Salaar Movie
x

హాలీవుడ్ టెక్నాలజీతో రాబోతున్న ప్రభాస్ "సలార్" (ట్విట్టర్ ఫోటో)

Highlights

* ఇండియన్ సినిమాలో ఈ టెక్నాలజీని వాడటం ఇదే మొదటిసారి

Prabhas - Salaar Movie: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధే శ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే మరోవైపు ప్రభాస్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీని వాడుతున్నారట. ఇంతకు ముందు ఈ అద్భుతమైన టెక్నాలజీని హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ చాలా వరకు తన సినిమాలలో వాడే టెక్నాలజీ ఇది. కానీ మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీని వాడుతున్న తెలుగు సినిమా "సలార్". ఇండియన్ సినిమాలో ఈ టెక్నాలజీని వాడటం ఇదే మొదటిసారి. ఈ టెక్నాలజీ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని దర్శక నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories