ఆ విషయంలో వెనకబడి ఉన్న మహేష్ బాబు డైరెక్టర్

ఆ విషయంలో వెనకబడి ఉన్న మహేష్ బాబు డైరెక్టర్

Rama Rao
Updated on: 28 April 2022 4:30 PM IST
Director Parasuram is not Focused on Sarkaru Vaari Paata Promotion
X

ఆ విషయంలో వెనకబడి ఉన్న మహేష్ బాబు డైరెక్టర్

Parasuram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలోనే పరశురాం డైరెక్షన్ లో "సర్కారు వారి పాట" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. "మహానటి" ఫేమ్ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇంతకు ముందు "గీత గోవిందం" సినిమా తో హిట్ అందుకున్న ఆ పరశురామ్ మహేష్ బాబు తో చేస్తున్న మొదటి సినిమా ఇది.

ఒక సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ కి కూడా అందులో కీలక భాగం ఉంటుంది. కానీ ప్రమోషన్స్ విషయంలో పరశురాం వెనకబడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే "సర్కారు వారి పాట" సినిమా మే 10న విడుదల అవుతుంది అని దర్శక నిర్మాతలు అధికారికంగా పోస్టర్ ద్వారా తెలియ చేసిన సంగతి తెలిసిందే.విడుదలకు ఇంకా రెండు వారాలు మాత్రమే సమయం ఉంది కానీ చిత్రబృందం మాత్రం ప్రమోషన్స్ విషయంలో ఇంకా వెనుకబడి ఉంది.

ఇప్పటికైనా పరసురామ్ సోషల్ మీడియాలో అయినా ఆక్టివ్ గా ఉండాలని కనీసం ఆ విధంగా మహేష్ ఫాన్స్ కి దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయని కొందరు చెబుతున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు. ట్రైలర్ తో ఆకట్టుకోగలిగితే సినిమాకి మరింత బజ్ దొరుకుతుంది. ట్రైలర్ విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ సిస్టం గురించి ఈ సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story