సర్కారు వారి పాట సన్నివేశాన్ని డిలీట్ చేశారు అంటున్న తమన్.. పరశురామ్ పై ట్రోలింగ్..

Director Parasuram is Being Trolled
x

సర్కారు వారి పాట సన్నివేశాన్ని డిలీట్ చేశారు అంటున్న తమన్.. పరశురామ్ పై ట్రోలింగ్..

Highlights

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కార్ వారి పాట" సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కార్ వారి పాట" సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంది.

ఈ నేపథ్యంలో అభిమానులు పరసురామ్ టేకింగ్ బాగోలేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. తాజాగా ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన తమన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. సినిమా మొత్తం మీద బీచ్ లో జరిగే ఫైట్ సినిమాకి అతి పెద్ద హైలెట్గా నిలిచింది అని చెప్పుకోవచ్చు. అయితే నిజానికి ఈ సినిమాలో గుడిలో జరగాల్సిన ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందట. సింహాచలం గుడి లో సముతిరఖని పూజ చేస్తూ ఉండగా ఫైట్ జరుగుతుందట. మంత్రాలు మరియు మ్యూజిక్ కలిసినట్లుగా అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుందని తమన్ చెప్పుకొచ్చారు.

"ఆ మ్యూజిక్ మీద వర్క్ చేస్తున్నప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసాము. ఈ ఫైట్ ఖచ్చితంగా ఫైనల్ కట్ లో ఉంటుందని అందరూ అనుకున్నాము కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. నేను ఆ పాటని విడిగా విడుదల చేస్తాను" అని అన్నారు తమన్. దీంతో అలాంటి ఒక సన్నివేశాన్ని ఫైనల్ కట్ నుండి తీసేసినందుకు మళ్లీ పరశురామ్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు అభిమానులు.

Show Full Article
Print Article
Next Story
More Stories