బలైన కొరటాల శివ తప్పించుకున్న పరశురామ్...

Director Parasuram Escape from Fans Trolls | Koratala Siva | Tollywood Gossips
x

బలైన కొరటాల శివ తప్పించుకున్న పరశురామ్...

Highlights

Parasuram: స్టార్ హీరోల సినిమాలు అంటే అభిమానులకు భారీగానే అంచనాలు ఉంటాయి...

Parasuram: స్టార్ హీరోల సినిమాలు అంటే అభిమానులకు భారీగానే అంచనాలు ఉంటాయి. కానీ అంచనాలను అందుకోవటంలో దర్శక నిర్మాతలు ఏమాత్రం విఫలమైనా అభిమానులు తారాస్థాయిలో వారిని ట్రోల్స్ చేస్తారు. ముఖ్యంగా సినిమా బాలేకపోతే అందరూ డైరెక్టర్ని వేలెత్తి చూపిస్తారు. ఈ మధ్యనే "ఆచార్య" సినిమాతో కెరీర్ లోనే మొట్టమొదటి డిజాస్టర్ ను అందుకున్న కొరటాల శివ అభిమానులు సోషల్ మీడియా లో తెగ ట్రోల్ చేశారు.

రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి నటించిన సినిమా కావడంతో మెగా అభిమానులకి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా అంతగా బాలేకపోవడంతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు కొరటాల శివ. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కారు వారి పాట" సినిమా కూడా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది.

కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. "గీత గోవిందం" ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో అభిమానుల ఆగ్రహానికి కొరటాల శివ బలయ్యారని కానీ "సర్కారు వారి పాట" ఈ సినిమాతో పరశురామ్ మాత్రం బాగానే తప్పించుకున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories