నాగ చైతన్య పరశురామ్ ల సినిమా పట్టాలు ఎక్కుతుందా?

*నాగ చైతన్య పరశురామ్ ల సినిమా పట్టాలు ఎక్కుతుందా?

Rama Rao
Updated on: 29 May 2022 7:30 PM IST
Director Parashuram is Waiting for a Movie with Naga Chaitanya
X

నాగ చైతన్య పరశురామ్ ల సినిమా పట్టాలు ఎక్కుతుందా?

Naga Chaitanya-Parasuram Movie: గీత గోవిందం సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన పరశురామ్ ఈ మధ్యనే మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్సర్ టాక్ ను అందుకుంటున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత పరశురామ్ తన తదుపరి సినిమా నాగచైతన్య తో చేయబోతున్నారు.

నిజానికి పరశురామ్ నాగచైతన్య తో సినిమాని చాలా త్వరగా మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ నాగచైతన్య మాత్రం ప్రాజెక్టుని ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య తన తదుపరి సినిమా థాంక్యూ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అదే జరిగితే పరశురాం కనీసం ఈ సంవత్సరమైనా నాగచైతన్య కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో పరశురాం నాగచైతన్యతో ఓ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండలేక ఈ గ్యాప్ లో మరో హీరోతో సినిమా ప్లాన్ చేస్తారా అని ఇంకా తెలియాల్సి ఉంది.

Rama Rao

Rama Rao

Next Story