మరొక నందమూరి హీరో తో "బింబిసారా" డైరెక్టర్

*రెండు సినిమాకి స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్న కళ్యాణ్ రామ్ డైరెక్టర్

Jyothi
Updated on: 9 Jan 2023 10:00 AM IST
Director of Bimbisara with Another Nandamuri Hero
X

మరొక నందమూరి హీరో తో "బింబిసారా" డైరెక్టర్

Mallidi Vasishta: మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. కానీ ఆ సినిమా తర్వాత తమ రెండవ సినిమా విషయంలో కూడా మంచి హీరోని సెట్ చేసుకోగలిగే డైరెక్టర్ లు కొంతమందే ఉన్నారు. మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యాక కూడా రెండవ సినిమా కోసం చాలానే నెలలు ఎదురు చూసిన డైరెక్టర్లు ఉన్నారు. కానీ కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "బింబిసారా" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మల్లిడి వశిష్ట మాత్రం ఈ కోవకు చెందరు.

మల్లిడి వేణు అలియాస్ వశిష్ట 2022లో కళ్యాణ్ రామ్ హీరోగా "బింబిసార" సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో తన నెక్స్ట్ సినిమా కోసం కూడా వేణు మరొక పెద్ద స్టార్ ని రంగంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం తన రెండవ సినిమా కోసం వేణు ఏకంగా నందమూరి బాలకృష్ణ మీద కన్నేసారని తెలుస్తోంది. ఈ మధ్యనే వేణు బాలకృష్ణకు ఒక మంచి కథను కూడా వినిపించారట.

బాలయ్య కు కూడా ఈ కథ బాగా నచ్చిందని సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వలువడనుంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ వేణు దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Jyothi

Jyothi

Next Story