Rashmika Mandanna: రష్మిక బ్యాన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్

Rashmika Mandanna: రష్మిక బ్యాన్ పై రియాక్ట్ అయిన కన్నడ డైరెక్టర్

Jyothi
Published on: 1 Dec 2022 8:22 AM IST
Director Nagashekar Shocking Comments About Rashmika Mandanna
X

Rashmika Mandanna: రష్మిక బ్యాన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్

Rashmika Mandanna: సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న పై కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ విధించబోతున్నారు అని గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పకపోవడంతో కన్నడిగులు ఆమెపై మండిపడుతున్నారు. కర్ణాటకలో పుట్టి పెరిగి తనని హీరోయిన్ గా మార్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పుకోవడానికి కూడా రష్మిక ఇష్టపడటం లేదని ఆమెకు కనీసం కృతజ్ఞత కూడా లేదని సోషల్ మీడియాలో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా కన్నడ సినిమాని మరొక మెట్టు పైకి ఎక్కించిన "కాంతారా" సినిమాని చూడలేదని కూడా రష్మిక చెప్పడంతో అభిమానులు ఆమె ప్రవర్తన పై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా డైరెక్టర్ నాగ శేఖర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక మందన్న వివాదం పై స్పందించారు. "సంజు వెడ్స్ గీత సినిమా లో చాలామంది కొత్త వాళ్ళకి నేను అవకాశం ఇచ్చాను. వాళ్ళు ఇప్పుడు కరియర్ లో పెద్ద స్టార్లుగా మారారు. కానీ వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకుంటారా లేదా అనేది వాళ్ళ వ్యక్తిగతం. దాన్ని నేను పట్టించుకోను. ఎదుటి వాళ్ళ నుంచి కృతజ్ఞతా భావాన్ని కోరుకున్నప్పుడు మనం ఎక్కడో ఒక చోట బాధ పడతాం. రష్మికపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధిస్తుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ అలా చేస్తే అది ఇండస్ట్రీకే నష్టం అని నా అభిప్రాయం. దాన్ని నేను సపోర్ట్ చేయను," అని స్పష్టం చేశారు నాగ శేఖర్. మరోవైపు తెలుగు, తమిళ్ భాషల్లో రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. నిజానికి ఆమెకు మొదటి సినిమా ఆఫర్ ఇచ్చింది రష్మిక మాజీ లవర్ రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ. అందుకే ఆమె ఆ నిర్మాణ సంస్థ పేరు చెప్పలేదని కొందరు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story