Maruti: సమయమే అన్నిటికీ జవాబిస్తుంది అంటున్న స్టార్ డైరెక్టర్

Maruti: చిన్న బడ్జెట్లో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ లు చేయడంలో దిట్ట స్టార్ డైరెక్టర్ మారుతి.

Sriveni Erugu
Published on: 23 Jan 2022 9:31 AM IST
Director  Maruti Tweeted Not Believe The Fake News | Tollywood NewS Today
X

సమయమే అన్నిటికీ జవాబిస్తుంది అంటున్న స్టార్ డైరెక్టర్

Maruthi: చిన్న బడ్జెట్లో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ లు చేయడంలో దిట్ట స్టార్ డైరెక్టర్ మారుతి. "భలే భలే మగాడివోయ్", "మహానుభావుడు" వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ మారుతి ఈ మధ్యనే "మంచిరోజులొచ్చాయి" అంటూ మంచి హిట్ ను అందుకున్నారు. అయితే ఇక మారుతి తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినప్పటికీ మారుతి ఈ హీరోతో సినిమా చేస్తున్నాడు ఆ హీరోతో సినిమా చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో తెగ పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

అంతేకాకుండా మారుతి సినిమా కథ ఎలా ఉండబోతోంది, సినిమాలో టెక్నీషియన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అంటూ చాలా వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ డైరెక్టర్ మారుతి వీటిని నమ్మొద్దు అంటూ ఒక ట్వీట్ చేశారు. "నా ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి, మ్యూజిక్ డైరెక్టర్, జోనర్ మరియు ఇతరత్రా విషయాలపై చాలా పుకార్లు వస్తున్నాయి. కానీ సమయం మాత్రమే అన్నిటినీ రివీల్ చేస్తుంది. మీ అందరి సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ కి నా కృతజ్ఞతలు. అందరూ జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్" అంటూ ట్వీట్ చేశారు మారుతి. ఇక మారుతి తదుపరి సినిమా గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story