Maruthi - Chiranjeevi: మెగాస్టార్ తో సినిమా చేయబోతున్న మారుతి

admin1
Updated on: 4 Aug 2021 3:50 PM IST
Director Maruthi Planning to Movie with Megastar Chiranjeevi
X

చిరు - మారుతి (ఫైల్ ఫోటో) 

Maruthi - Chiranjeevi: "ఈరోజుల్లో" సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా మారుతి "భలే భలే మగాడివోయ్", "మహానుభావుడు" వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. తన సినిమాలలో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మరియు రొమాన్స్ కు పెద్ద పీట వేసే మారుతి ఈ మధ్యనే "ప్రతి రోజు పండగే" సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. అయితే ఇప్పటిదాకా మీడియం రేంజ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన మారుతి ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దొరికిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి కోసం మారుతి ఏకంగా మూడు కథలు రాసుకున్నాడట. ఈ మధ్యనే ఆ మూడు కథలను వినిపించగా చిరంజీవి అందులో ఒక కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను స్వయంగా నిర్మించనుంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రావాల్సి ఉంది. మరో వైపు మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story