Maruthi With Raviteja : మారుతి డైరెక్షన్‌లో రవితేజ?

Maruthi With Raviteja : ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో మారుతి ఒకరు.. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి

Krishna
Published on: 7 Aug 2020 1:53 PM IST
Maruthi With Raviteja : మారుతి డైరెక్షన్‌లో రవితేజ?
X
Raviteja (File Photo)

Maruthi With Raviteja : ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న దర్శకుల్లో మారుతి ఒకరు.. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన మారుతి బస్ స్టాప్, కొత్త జంట, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు చిత్రాలను అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి పెద్ద హిట్ కొట్టాడు..ఇక గత ఏడాది డిసెంబర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ప్రతిరోజూ పండగే అనే చిత్రాన్ని తెరకెకెక్కించి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు మారుతి.. ఆయితే మారుతి తర్వాత సినిమాకి హీరో ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే తాజా సమాచారం ప్రకారం మారుతి తన తదుపరి చిత్రాన్ని మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో చేయ‌బోతున్నార‌ని తెలిసింది. ఇటీవ‌లే మారుతి రవితేజకి లైన్ వినిపించారని, కాన్సెప్ట్ కూడా కొత్తగా వుండ‌టంతో రవితేజ కూడా ఓకే చెప్పారని సమాచారం.. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.

ఇక ప్రస్తుతం రవితేజ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్‌' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతిహసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ తర్వాత రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు రవితేజ కమిట్ అయ్యారు. ఇక నేను లోకల్ ఫేం త్రినాథరావు నక్కినతో మరో సినిమాని లైన్ లో పెట్టారు రవితేజ.. ఈ సినిమాల తరవాత మారుతి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం!

Krishna

Krishna

Next Story