Navarasa Teaser: మణిరత్నం'నవరస' టీజర్‌..వెబ్‌ సిరీస్‌ కా బాప్‌..

Navarasa Teaser: మణిరత్నం నిర్మిస్తున్న ఈ కథా సంకలనం తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ కార్మికులని ఆదుకోవడమే లక్ష్యం

Kranthi
Updated on: 9 July 2021 3:22 PM IST
Mani Ratnam Navarasa Web Series Teaser Released
X

Mani Ratnam Navarasa Teaser:(binged)

Navarasa Teaser: ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటే పడిచచ్చేవాళ్లు. అందమైన ప్రకృతిని చూపిస్తూ.. ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉండేది. దీనికి తోడు సూపర్ డూపర్ మ్యూజిక్ అందించేవారు. విజువల్ ఫీస్ట్ లా ఉండే సినిమాలు అనేకం వచ్చాయి ఆయన డైరెక్షన్ లో. కాని ఈ మధ్య ఆ జోరు తగ్గిపోయింది. సరైన హిట్ కొట్టి ఎన్నాళ్లయిందో.. మరి ఏమనుకున్నారో ఏమో.. ఇప్పుడు వెబ్ సిరీస్ మీద దృష్టి పడింది. అప్ డేట్ గా ఉండాలనుకున్నారేమో.. సిరీస్ 9 పార్టులు 9 మందితో డైరెక్షన్ చేయించేలా ప్లాన్ చేశారు. అలా అయితే గాని.. ఓటీటీలు ఎగబడి కొనవు కదా. అందుకే అలా సెట్ చేశారు.తాజాగా ఈ వెబ్‌సిరీస్‌ టీజర్‌ను విడుదల చేశారు.

రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌, బిజోయ్‌ నంబియార్‌, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, సర్జున్‌ కె.ఎం, ప్రియదర్శన్‌, కార్తీక్‌ నరేన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, వసంత్‌ ఇలా తొమ్మిది మంది దర్శకులు 9 భాగాలను తెరకెక్కిస్తున్నారు.సూర్య, సిద్ధార్థ్‌, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్‌, అరవింద్‌ స్వామి, రోబో శంకర్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'నవరస' ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆగస్టు 6వ తేదీన ప్రముఖ ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్‌' వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

హాస్యం, శృంగారం, కరుణ, శాంతం, రౌద్రం, బీభత్సం, భయానకం, అద్భుతం, వీరం... ఇలా నవరసాలతో కూడిన చిత్రాలు ఇవి. ఒక్కో కథ ఒక్కో భావోద్వేగం నేపథ్యంగా సాగుతుంది. మరి తొమ్మిది కథలు సంగతి ఏంటి? ఎవరు ఏయే పాత్రల్లో అలరించనున్నారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ టీజర్‌ చూసేయండి. ఈ సిరీస్‌కి ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరో దర్శకుడు జయేంద్రతో కలిసి మణిరత్నం నిర్మిస్తున్న ఈ కథా సంకలనం తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ కార్మికులని ఆదుకోవడమే లక్ష్యంగా రూపుదిద్దుకుంది ఈ వెబ్ సిరీస్.


Kranthi

Kranthi

Next Story