Ram Charan New Movie 2021: రామ్ చరణ్ తో తమిళ స్టార్ డైరెక్టర్?

రామ్ చరణ్, లోకేష్ కనగరాజు (ఫొటో ట్విట్టర్)
Ram Charan New Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో సినిమాను లైన్ లోపెట్టేందుకు సిద్ధమయ్యాడంట.
Ram Charan New Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరో సినిమాను లైన్ లో పెట్టేందుకు సిద్ధమయ్యాడంట. ఓ తమిళ డైరెక్టర్‌తో ఈ మేరకు చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ పేరు సంపాదించుకుని, వరుస విజయాలతో దూసుకపోతున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజు. ఈయన కార్తీ హీరోగా 'ఖైదీ' సినిమాతో క్రేజ్ పొందాడు. అలాగే తాజాగా తలపతి విజయ్‌తో మాస్టర్ సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ రెండు సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఘన విజయం సాధించాయి. కాగా, లోకేష్ కనగరాజుతో పనిచేసేందుకు చాలామంది టాలీవుడ్ స్టార్స్ ఎదురుచూస్తున్నారంట.
రామ్‌చరణ్‌తో కనగరాజు ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై రామ్‌చరణ్ కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరి కాంబోలో తెలుగు, తమిళ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తారని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉందంట. ఈమేరకు డైరెక్టర్ కనగరాజుకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఇంతవరకు ఏలాంటి అప్‌డేట్ అయితే వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT