"నాకు ఆయనంత జ్ఞానం లేదు," అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్న డైరెక్టర్

"పూరికి ఉన్నంత జ్ఞానం నాకు లేదు" అంటున్న కృష్ణవంశీ

Arun Chilukuri
Published on: 23 Aug 2022 2:11 PM IST
Director Krishna Vamsi About Puri Jagannadh Puri Musings
X

"నాకు ఆయనంత జ్ఞానం లేదు," అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్న డైరెక్టర్

Krishna Vamsi: "గులాబీ", "నిన్నే పెళ్ళాడుతా", "సింధూరం", "ఖడ్గం" వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ 2017లో విడుదలైన "నక్షత్రం" సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాకి దర్శకత్వం వహించలేదు. చాలాకాలం తర్వాత మళ్లీ ఇప్పుడు "రంగమార్తాండ" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. అయితే ఎప్పటినుంచో కృష్ణవంశీ "వందేమాతరం" అనే సినిమాని తీయాలని అనుకుంటున్నారు కానీ ఆ సినిమా మాత్రం ఇంకా పట్టాలెక్కటం లేదు.

మరోవైపు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్యనే "జనగణమన" అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో "వందేమాతరం" సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా తీయాలనే ఆలోచన ఇంకా ఉన్నట్లు చెప్పారు కృష్ణవంశీ. ఇక పూరి జగన్నాథ్ పూరి మ్యూజింగ్స్ అనే పేరుతో చిన్న చిన్న ఆడియో క్లిప్స్ ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిని విన్నారా అని అడగగా కృష్ణవంశీ విన్నానని కానీ తను అలా చెప్పలేనని అన్నారు.

"నాకంత జ్ఞానం ఉందని నేను అనుకోవటం లేదు. జనాలకి చెప్పేంత జ్ఞానం ఉందని నేను అనుకోను. నేనేం చెప్పాలి అనుకున్నా అది నా సినిమాల నుంచి చెప్తాను," అని అన్నారు కృష్ణవంశీ. ఇక "రంగమార్తాండ" సినిమాతో ఫ్యామిలీ మెసేజ్ ఇవ్వబోతున్నానని సినిమా చూశాక అందరికీ ఫ్యామిలీ గుర్తొస్తుందని అన్నారు కృష్ణవంశీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story