Sonu Sood New Movie: క్రిష్ డైరెక్షన్‌లో సోనుసూద్?

Sonu Sood New Movie: కరోనావైరస్ సంక్షోభంలో సోనుసూద్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఈ కఠిన సమయంలో ఎంతోమందికి ఆయన సహాయం చేశాడు.

Venkata Chari
Published on: 19 May 2021 5:59 PM IST
Director Krish to Direct a New Movie with Sonu Sood
X

క్రిష్ డైరెక్షన్‌లో సోనుసూద్? (ఫొటో ట్విట్టర్)

Sonu Sood New Movie: కరోనావైరస్ సంక్షోభంలో సోనూసుద్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఈ కఠిన సమయంలో ఎంతోమందికి ఆయన సహాయం చేశాడు. ఎవరు ఎలాంటి సహాయం అడిగినా.. కాదనకుండా తను వారి వెంట నిలబడి ధైర్యమిచ్చాడు ఈ బాలీవుడ్ నటుడు.

ప్రస్తుతం సోనుసూద్ కి వృత్తి పరంగా చాలా ప్లస్ పాయింట్ అయ్యిందనే చెప్పాటి. చాలామంది దర్శక నిర్మాతలు అనేక ఆఫర్లతో క్యూ కడుతున్నారంట. హీరోగా, కీలక పాత్రల్లో నటించేందుకు వరుసగా అవకాలు వస్తున్నాయని సమాచారం. తాజా నివేదికల ప్రకారం, దర్శకుడు క్రిష్ సోను సూద్ కోసం ఓ కథను రాస్తున్నాడని తెలుస్తోంది. క్రిష్ ఇప్పటికే సోనుసూద్‌ను సంప్రదించినట్లు సమాచారం. దీనికి సోనూ కూడా ఆమోదం చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌ తో నిర్మించి, పాన్-ఇండియన్ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ యోచిస్తున్నారని సమాచారం.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి రాబోతున్న 'హరి హర వీర మల్లు' చిత్రంతో డైరెక్టర్ క్రిష్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక సోనుసూదు తో సినిమా మొదలుకానున్నట్లు సమాచారం.

Venkata Chari

Venkata Chari

Next Story