Krish About Pawan kalyan Movie : పవన్ తో సినిమా ఆగిపోలేదు.. క్రిష్ క్లారిటీ!

Krish About Pawan kalyan Movie : రెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్.. అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే

Krishna
Published on: 19 Aug 2020 12:34 PM IST
Krish About Pawan kalyan Movie : పవన్ తో సినిమా ఆగిపోలేదు.. క్రిష్ క్లారిటీ!
X
pawan kalyan, krish (File Photo)

Krish About Pawan kalyan Movie : రెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్.. అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి ఇది రీమేక్.. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.. పవన్ కళ్యాణ్ తో పాటుగా అనన్య పాండే, అంజలి, నివేధా థామస్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు..వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్, దిల్ రాజులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తరవాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని ఇప్పటికే మొదలు పెట్టేశాడు పవన్.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.. ఈ మూవీ ఇప్పటికే సైలెంట్‌గా రెండు కీల‌క షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. . కూడా వ్యాక్సిన్ వ‌చ్చిన త‌రువాతే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటాన‌ని చెప్పేశాడు.. అటు క్రిష్ కూడా మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో తాజాగా ఓ కొత్త సినిమాని మొదలుపెట్టాడు..

దీనితో క్రిష్, పవన్ మూవీ ఆగిపోయిందన్న రూమర్స్ మొదలయిపోయాయి.. అయితే దీనిపైన దర్శకుడు క్రిష్ స్పందించారు.. ప‌వ‌న్‌తో చేస్తున్న సినిమా ఆగిపోలేద‌ని క్లారిటీ ఇచ్చారు.. క‌రోనా వైర‌స్ కారణంగానే సినిమా వాయిదా పడిందని, వ‌చ్చే ఏడాది తిరిగి మిగిలిన పార్ట్ ని కంప్లీట్ చేస్తామని క్రిష్ స్పష్టం చేశారు. ఇది పవన్ కళ్యాణ్ కి 27 వ సినిమా కావడం విశేషం.

Krishna

Krishna

Next Story