మళ్లీ ప్రాస్టిట్యూట్ సబ్జెక్టుతో క్రిష్

Director Krish Plans Web Series Based on a Prostitute’s Life
x

మళ్లీ ప్రాస్టిట్యూట్ సబ్జెక్టుతో క్రిష్

Highlights

Director Krish: గమ్యం, వేదం, కంచె వంటి మంచి సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిష్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు.

Director Krish: గమ్యం, వేదం, కంచె వంటి మంచి సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిష్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. ఈ మధ్యనే వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన "కొండపొలం" సినిమాతో కూడా క్రిష్ ఏ మాత్రం మెప్పించలేకపోయారు. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "హరిహర వీరమల్లు" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తయింది.

అయితే పవన్ కళ్యాణ్ అంచనాలను ఈ సినిమా అందుకోవటం లేదు అంటూ గత కొద్ది రోజులుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే క్రిష్ పవన్ కళ్యాణ్ కి నచ్చే విధంగా సినిమాలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు క్రిష్ ఒక ఫిమేల్ సెంట్రిక్ వెబ్ సిరీస్ తీయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారట. ఒక వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ కదా ఉండబోతోందని తెలుస్తోంది.

ఇప్పటికే తన "వేదం" సినిమాలో ప్రాస్టిట్యూట్ సబ్జెక్టుతో క్రిష్ బాగానే మెప్పించారు. ప్రాస్టిట్యూట్ గా నటించిన అనుష్కకి కూడా మంచి పేరు వచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం ఒక ప్రాస్టిట్యూట్ పడే ఇబ్బందులు, బాధలు, మరియు తన జీవితం ఎలా ఉంటుంది అనే కోణంలో కథని సిద్ధం చేస్తున్నారట. మరి ఇందులో ఏ హీరోయిన్ ని ఎంపిక చేస్తారో ఇంకా వేచి చూడాల్సి ఉంది. ఈ వెబ్ సిరీస్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories