Krish-Pawan Kalyan: విజువల్ ఎఫెక్ట్స్ తో పవన్ కళ్యాణ్ ని మెప్పించిన క్రిష్

Krish-Pawan Kalyan: "హరిహర వీరమల్లు" అవుట్పుట్ తో సంతోషంగా ఉన్న పవన్ కళ్యాణ్

admin1
Updated on: 8 Feb 2022 3:28 PM IST
Director Krish Impresses Pawan Kalyan With His Visual Effects
X

Krish-Pawan Kalyan: విజువల్ ఎఫెక్ట్స్ తో పవన్ కళ్యాణ్ ని మెప్పించిన క్రిష్

Krish-Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమా త్వరలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో "హరిహర వీరమల్లు" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా తమిళ వర్షన్ వెర్షన్ రైటర్ లతో పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ డిస్కషన్ లో పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్. తన పాత్ర కోసం జుట్టుని పెంచబోతున్నారు. తాజాగా ఇప్పటిదాకా పూర్తయిన షూటింగ్ అవుట్పుట్ చూసారు పవన్ కళ్యాణ్.

సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలకు విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి క్రిష్ పవన్ కళ్యాణ్ కు చూపించారట. పవన్ కళ్యాణ్ కరియర్లో చేస్తున్న మొట్టమొదటి విజువల్ ఎఫెక్ట్స్ కాస్ట్యూమ్ డ్రామా ఈ సినిమా. సినిమా అవుట్ పుట్ చూసి పవన్ కళ్యాణ్ కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు క్రిష్ డైరెక్షన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ సినిమాలు విడుదలయ్యాయి. కాబట్టి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా త్వరలోనే మళ్లీ సెట్స్ పైకి వెళ్లబోతోంది.

admin1

admin1

Next Story