"ఆచార్య" విషయంలో బుర్ర బద్దలు కొట్టుకుంటున్న శివ

"ఆచార్య" విషయంలో బుర్ర బద్దలు కొట్టుకుంటున్న శివ

Rama Rao
Updated on: 14 March 2022 5:01 PM IST
Director Koratala Siva Worried about the Acharya Movie Run Time
X

"ఆచార్య" విషయంలో బుర్ర బద్దలు కొట్టుకుంటున్న శివ

Koratala Siva: మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివ ఈ సినిమా పనుల్లో తలమునకలై ఉన్నారు. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే చాలా కష్టాలు పడ్డ చిత్ర బృందానికి ఇప్పుడు మరో కష్టం వచ్చి పడింది. ఆచార్య రఫ్ కాఫీ రన్ టైం మూడు గంటలు ఉందట. ఇక ఈ సినిమా కి ఉండే కంటెంట్ కి ఆ మాత్రం డ్యూరేషన్ ఉండాలని కొరటాల శివ కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశారు.

ఒకవేళ సినిమా గనక ఫ్లాప్ అయితే రన్ టైం కూడా దానికి ఒక కారణం అవుతుంది. ఇక ఆ సినిమాకి కొంచెం నెగెటివ్ టాక్ వచ్చినా కూడా రన్ టైం పెద్ద దిసడ్వాంటేజ్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో రన్ టైం గురించి కొరటాల శివ చిత్ర బృందంతో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని ప్రయత్నిస్తున్నారు. మూడు గంటలు ఉంచేయాలా లేక కొన్ని సన్నివేశాలను కట్ చేసి సినిమాని క్రిస్ప్ గా చేయాలా అని కొరటాల శివ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, పూజా హెగ్డే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ మరియు నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు.

Rama Rao

Rama Rao

Next Story