Allu Arjun 21 Movie : కొరటాల, అల్లు అర్జున్ మూవీ క్రేజీ అప్డేట్!

Allu Arjun 21 Movie : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Krishna
Published on: 29 Aug 2020 10:57 AM IST
Allu Arjun 21 Movie : కొరటాల, అల్లు అర్జున్ మూవీ క్రేజీ అప్డేట్!
X

Koratala siva, Allu arjun

Allu Arjun 21 Movie : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని యువసుధ, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మల్టిపుల్ లాంగ్వేజీలలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. త్వరలో సినిమాకి సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయన్నున్నారు. ఇక బన్నీతో కొరటాల మూవీ అంటే టాలీవుడ్ లో ఇప్పటినుంచే అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇది కొరటాలకి ఆరో సినిమా కాగా, అల్లు అర్జున్ కీ 21 వ చిత్రం..

అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకి మెలోడి బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో "ఆచార్య" అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాకి మణిశర్మ అందించిన పాటలకి కొరటాల శివ చాలా ఇంప్రెస్ అయ్యారట.. దీనితో మరోసారి మణిశర్మని రిపీట్ చేయాలనీ అనుకుంటున్నారట.. కానీ దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.. గతంలో మణిశర్మ అల్లు అర్జున్ పరుగు సినిమాకి సంగీతం అందించాడు.

ఇక ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది..

Krishna

Krishna

Next Story