అందుకే కాజల్ పాత్రను తీసేసాము అంటున్న కొరటాల శివ

Acharya: గత కొంత కాలంగా చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన కాజల్ అగర్వాల్ పాత్ర గురించి ఎన్నో పుకార్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 25 April 2022 8:49 PM IST
Director Koratala Siva opens up on Kajal Aggarwal Role
X

అందుకే కాజల్ పాత్రను తీసేసాము అంటున్న కొరటాల శివ

Acharya: గత కొంత కాలంగా చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన కాజల్ అగర్వాల్ పాత్ర గురించి ఎన్నో పుకార్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ రాకపోవడం, కాజల్ కి సంబంధించిన ఒక పోస్టర్ కూడా దర్శకనిర్మాతలు విడుదల చేయకపోవడం ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక తాజాగా చిత్ర డైరెక్టర్ కొరటాల శివ కాజల్ పాత్ర గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. అసలు సినిమాలో నుంచి కాజల్ పాత్రను తీసేసి నట్లుగా చెప్పి బాంబు పేల్చారు కొరటాల.

"ఆచార్య కథ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆచార్య పాత్రకి ప్రేమకథ ఉంటే బాగుంటుందని అనుకున్నాను. ధర్మస్థలి నుంచి ఒక సాదాసీదా అమ్మాయి ఆచార్య తో ప్రేమలో పడుతుంది. కానీ ఆచార్య కి ప్రేమపై ఆసక్తి లేదు. కాబట్టి కాజల్ పాత్ర పై మాకు సెకెండ్ థాట్స్ వచ్చాయి. కాజల్ పాత్రతో పాటలు లేవు. తన పాత్రకి లాజికల్ కంక్లుషన్ కూడా లేదు. ఏదో కేవలం కమర్షియల్ సినిమా కాబట్టి హీరోయిన్ పాత్ర ఉండాలి అన్నట్టు ఉంటుంది. ఇదే విషయాన్ని చిరంజీవి గారితో మాట్లాడితే ఏది మంచిదో అదే చెయ్యమని చెప్పారు. కాజల్ కూడా చాలా పెద్ద మనసుతో తన పాత్రను తొలగించడానికి ఒప్పుకుంది. ఆచార్య టీంతో త్వరలో కచ్చితంగా కలిసి పని చేస్తానని నవ్వుతూ చెప్పింది" అని అన్నారు కొరటాల శివ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story