Devara 2: అసలు మలుపు పార్ట్‌ 2లోనే.. కొరటాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Koratala on Devara 2: ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Oct 2024 11:38 AM IST
Director Koratala Siva Interesting Comments About Devara 2 Movie
X

Devara 2: అసలు మలుపు పార్ట్‌ 2లోనే.. కొరటాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Koratala on Devara 2: ఎన్టీఆర్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలిరోజు నుంచి పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. భారత మార్కెట్‌తో పాటు ఓవర్‌సీస్‌లోనూ భారీ వసూళ్లను రాబట్టి తారక్‌ కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా సుమారు రూ. 400 కోట్లకుపైగా రాబట్టింది.

ఇక ప్రస్తుతం పెద్ద సినిమా ఏదీ లేకపోవడం, దసరా హాలీడేస్‌ కలిసిరావడంతో దేవర రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరి దృష్టి దేవర పార్ట్‌2పై పడింది. దేవర క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కొరటాల పార్ట్‌2పై ఆసక్తిని పెంచారు. ఇంతకీ అసలు కథ ఏంటన్న క్యూరియాసిటీ పెంచేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన కొరటాల దేవర2కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేవర2లో జాన్వీ పాత్ర అసాధారణంగా ఉంటుందని కొరటాల తెలిపారు, జాన్వీ పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారన్నారు. మొదటిభాగం కంటే రెండోభాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిపారు. సినిమా చూసే ప్రేక్షకులు సీట్‌ ఎడ్జికి వస్తారని, ఒక దర్శకుడిగా నేను పార్ట్‌ 2 విషయంలోనూ ఎంతో నమ్మకంగా, ఆసక్తిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కథలో అసలు మలుపు పార్ట్‌ 2లోనే ఉందన్న కొరటాల... ప్రతీ పాత్ర హైలో ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఇక పార్ట్‌1లో చూసింది కేవలం 10 శాతం మాత్రమేనని, రెండో భాగంలో 100 శాతం చూస్తారని కొరటాల ఎన్టీఆర్‌ అభిమానులకు హామీ ఇచ్చారు. ప్రతీ పాత్రలో ట్విస్ట్‌ ఉంటుందని, కొన్ని సన్నివేశాలు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయని కొరటాల చెప్పుకొచ్చారు. దేవర2కి సంబంధించి కథ సిద్ధంగా ఉందని, మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story