"అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్" అంటున్న కొరటాల శివ

Director Koratala Shiva says Swamy Vivekananda Journey his Dream Project
x

"అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్" అంటున్న కొరటాల శివ

Highlights

Koratala Siva: ఇప్పటివరకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించింది నాలుగు సినిమాలే అయినప్పటికీ ఆ నాలుగు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్లుగా మారాయి.

Koratala Siva: ఇప్పటివరకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించింది నాలుగు సినిమాలే అయినప్పటికీ ఆ నాలుగు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్లుగా మారాయి. తాజాగా మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన "ఆచార్య" సినిమా ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నారు. "జనతా గ్యారేజ్" సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొరటాల శివ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చారు.

తాను చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద ను బాగా ఇష్టపడే వారట. ఎప్పటికైనా స్వామి వివేకానంద జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీయాలని అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు కొరటాల శివ. అయితే బయోపిక్ అయినప్పటికీ లార్జ్ కాన్వాస్ పై ఈ సినిమాని తీసి హాలీవుడ్ లో మహాత్మా గాంధీ బయోపిక్ తీసిన రేంజ్ లో తీయాలని ఆశ పడుతున్నట్లుగా చెప్పారు కొరటాల శివ. కమర్షియల్ సినిమాలు అయినప్పటికీ కొరటాల శివ తీసే సినిమాల్లో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఇప్పటికే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న కొరటాల శివ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఎప్పుడు పట్టాలెక్కిస్తారో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories