విశ్రాంత ఉద్యోగిగా దర్శకేంద్రుడు?

విశ్రాంత ఉద్యోగిగా దర్శకేంద్రుడు?
x
Highlights

అయితే తాజా సమాచారం ప్రకారం అయన విశ్రాంత ఉద్యోగి (రిటైర్డ్ ఎంప్లాయీ)గా కనిపిస్తారట. అంటే అయన వయసుకి తగ్గ పాత్రే అన్నమాట. ఇక ఇందులో అయన భార్యగా రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది.

తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు. తాజాగా అయన నటుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. రచయిత, నటుడు తనికెళ్ళ భరణి దర్శకత్వంలో అయన సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషించనున్నారన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం అయన విశ్రాంత ఉద్యోగి (రిటైర్డ్ ఎంప్లాయీ)గా కనిపిస్తారట. అంటే అయన వయసుకి తగ్గ పాత్రే అన్నమాట. ఇక ఇందులో అయన భార్యగా రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. రమ్యకృష్ణతో పాటుగా సమంత, శ్రియ కూడా ఈ సినిమా కోసం ఎంపిక అయ్యారని మరో కొత్త అమ్మాయిని కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలొనే దీనిపైన అధికార ప్రకటన రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

ప్రస్తుతం రాఘవేంద్రరావు పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆఫీషియల్ గా అనౌన్స్ ఇచ్చారు రాఘవేంద్రరావు. ఇందులో హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని ఆర్.కె ఫిలిం అసిసియేషన్ బ్యానర్, ఆర్కా మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories