Harish Shankar: సాయి ధరమ్ తేజ్ ని కలిసిన హరీష్ శంకర్

Harish Shankar: మెగా హీరో ని పలకరించి వచ్చిన పవన్ కళ్యాణ్ డైరెక్టర్

admin1
Published on: 21 Oct 2021 7:15 PM IST
Director Harish Shankar Meets Sai Dharam Tej
X

హీరో సాయి ధరమ్ తేజ్ ను కలిసిన హరీష్ శంకర్ (ఫైల్ ఇమేజ్)

‌Harish Shankar: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే రోడ్ యాక్సిడెంట్ వల్ల ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటిలో ఫిజియోథెరపీ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ కి సన్నిహితులైన కొందరు నటీ నటులు మరియు డైరెక్టర్లు కూడా మెగా హీరో ను పలకరించేందుకు వెళుతున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా సాయి ధరంతేజ్ నీ పరామర్శించడానికి వెళ్లి వచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు "గబ్బర్ సింగ్" డైరెక్టర్.

"నా సోదరుడు సాయి ధరమ్ తేజ్ ని కలిసాను. మేం ఇద్దరం చాలా బాగా మాట్లాడుకున్నాము. తను ఇప్పుడు చాలా ఫిట్ గా ఉన్నాడని చెప్పటం నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మళ్లీ మన ముందుకు రాబోతున్నాడు" అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు హరీష్ శంకర్. సాయి ధరమ్ తేజ్ కనిపించకుండా కేవలం వారి చేతులను మాత్రమే ఫోటో తీసి పెట్టారు హరీష్ శంకర్. ఏదేమైనా సాయి ధరంతేజ్ కోలుకుంటున్నందుకు మెగా అభిమానులు చాలా సంతోష పడుతున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ కి ఇండస్ట్రీ లో ఉన్న మంచి స్నేహితులు లో హరీష్ శంకర్ కూడా ఒకరు. సాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్" సినిమా మంచి హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.


admin1

admin1

Next Story