ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్న డైరెక్టర్

ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్న డైరెక్టర్

admin1
Updated on: 22 March 2022 1:00 PM IST
Director Geetha Krishna Comments on Jr NTR | Telugu Movie News
X

ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్న డైరెక్టర్

Geetha Krishna: సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మల్టీస్టారర్ భారీ బడ్జెట్ సినిమా కి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. థియేటర్లలో భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చి 25 న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే తాజాగా ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ ఎన్టీఆర్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ బ్లడ్ నుంచి వచ్చినా సరే యాక్టింగ్ విషయంలో ఆయన ను అనుసరించలేదని అలాగే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి ఎవరో తనకు తెలియదని ఎన్టీఆర్ అన్నాడని ఆ సమయంలో నాగార్జున కొంచెం తగ్గు బాబు అంటూ తారక్ ను కరెక్ట్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ చిరంజీవి గురించి అలా అన్నట్టుగా ఇప్పటికీ తగిన ఆధారాలు లేవు. కానీ మరోవైపు అభిమానులు మాత్రం తారక్ అలా అనే ఛాన్సే లేదని పెద్దలను గౌరవించే విషయంలో తారక్ ముందు ఉంటాడు అని చెప్పుకొస్తున్నారు.

admin1

admin1

Next Story