Dil Raju: అల్లు అరవింద్ పద్ధతిని వాడుతున్న దిల్ రాజు

Dil Raju: * కియార కి దాదాపుగా 12 కోట్ల రెమ్యునరేషన్ ని ఇచ్చినట్లు సమాచారం.

admin1
Updated on: 1 Oct 2021 2:00 PM IST
Director Dil Raju Paid Remuneration for Three Movies to Kiara Advani | Cinema News Today
X

దిల్ రాజు (ఫోటో- ది హన్స్ ఇండియా)

Dil Raju: ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు. మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్ మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాని కూడా నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం దిల్ రాజు ఇప్పటికే చాలా మంది హీరోయిన్లని అనుకున్నారట. కానీ ఈ సినిమా కోసం హీరోయిన్ ని ఎంపిక చేసుకోవడానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్ట్రాటజీని వాడారట.

అల్లు అరవింద్ ఒక హీరోయిన్ ని కనీసం మూడు సినిమాలకీ సైన్ చేయించి భారీ రెమ్యూనరేషన్ ఇస్తారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని కి కూడా దిల్ రాజు అదే ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే దిల్ రాజు నిర్మించిన "వినయ విధేయ రామ" సినిమాలో హీరోయిన్ గా నటించింది కీయార. తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ సరసన మళ్లీ శంకర్ దర్శకత్వంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు విజయ్ - వంశీ పైడిపల్లి సినిమాలో కూడా హీరోయిన్గా కియారనే ఎంపిక చేసారు దిల్ రాజు. ఈ మూడు సినిమాలకి కలిపి కియార కి దాదాపుగా 12 కోట్ల రెమ్యునరేషన్ ని ఇచ్చినట్లు సమాచారం.

admin1

admin1

Next Story