
Devakatta Indraprastham Motion Poster : ఇండస్ట్రీలో విభిన్న కథ చిత్రాల దర్శకుడిగా డైరెక్టర్ దేవకట్టాకి మంచి పేరుంది. ప్రస్థానం, ఆటో నగర్ సూర్య సినిమాలు
Devakatta Indraprastham Motion Poster : ఇండస్ట్రీలో విభిన్న కథ చిత్రాల దర్శకుడిగా డైరెక్టర్ దేవకట్టాకి మంచి పేరుంది. ప్రస్థానం, ఆటో నగర్ సూర్య సినిమాలు ఆయనకి మంచి పేరును తీసుకువచ్చాయి. తాజాగా అయన ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లీడర్స్ నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల స్నేహ బంధం పై ఓ సినిమాని తీస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాకి 'ఇంద్రప్రస్థం' టైటిల్ ని అనౌన్స్ చేస్తూ ఆఫీషియల్ గా ప్రీ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు ఇందులో చంద్రబాబు, వైఎస్ఆర్ ల యొక్క షాడో ఇమేజ్ ని చూపించారు దేవకట్టా.
ఇక దేవకట్టా ఎంత మంచి దర్శకుడో అంత మంచి డైలాగ్ రైటర్ అన్న సంగతి తెలిసిందే.. ఇక విడుదలైన చేసిన మోషన్ పోస్టర్‌లో కూడా తన పదునైన డైలాగులతో అందరినీ ఆకట్టుకున్నాడు. ''ప్రపంచంలో జరిగే పోటీలన్నింటికీ పర్పస్ ఒక్కటే. విజేతలను ఎంచుకోవడం.. ఆ విజేతలే ప్రపంచాన్ని నడిపిస్తారు. అయితే ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే ఆ ఆటకున్న కిక్కేవేరు'' చెప్పిన ఈ డైలాగ్ సినిమా పైన భారీ అంచనాలను క్రియేట్ చేసింది.. వైఎస్‌ఆర్, సీబీఎన్ రాజకీయ జీవితంపై 2017లోనే తాను స్క్రిప్ట్ రాశానని, ఈ కల్పిత కథను కాపీ రైట్స్ యాక్ట్ కింద రిజిస్టర్ కూడా చేయించానని దేవాకట్టా వెల్లడించారు.
ఇక ఈ సినిమాని ప్రొడోస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ తేజసి, హర్ష విలు నిర్మిస్తున్నారు..సినిమాకి సంబంధించిన నటీనటులని, సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించనున్నారు. ఇక అటు దేవాకట్టా ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని శ్రీవెంకటేశ్వరర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




