Pawan Kalyan - Deva Katta: పవన్ తో సినిమా ప్లాన్ చేస్తున్న దేవ కట్ట

* పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రాస్తున్న దేవ కట్ట

admin1
Updated on: 6 Oct 2021 8:00 PM IST
Director Deva Katta Planning to Movie With Pawan Kalyan
X

పవన్ కళ్యాణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్న దేవ కట్ట (ఫైల్ ఫోటో)

Pawan Kalyan - Deva Katta: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన "రిపబ్లిక్" సినిమాకి దర్శకత్వం వహించిన దేవకట్టా మంచి విజయాన్ని అందుకున్నారు. పొలిటికల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన "రిపబ్లిక్" బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం దేవకట్టా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం దేవకట్ట ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ని రాయటం మొదలు పెట్టారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ కి దగ్గరగా ఉండే స్క్రిప్ట్ ని రాయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దేవకట్టా. ఇప్పటికే "ప్రస్థానం" వంటి హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన దేవకట్టా పవన్ కళ్యాణ్ కోసం కూడా అలాంటి ఒక స్ట్రాంగ్ సబ్జెక్టుతో వస్తారని అభిమానులు కూడా నమ్ముతున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయ పనులతో మాత్రమే కాకుండా మరోవైపు "భీమ్లా నాయక్" మరియు "హరిహర వీరమల్లు" సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

admin1

admin1

Next Story