Geetha Arts: గీత ఆర్ట్స్ లో చేరిన మరొక ఫ్లాప్ డైరెక్టర్..

"మిస్టర్ పర్ఫెక్ట్" డైరెక్టర్ కి రెండే దారులు

Arun Chilukuri
Updated on: 4 Sept 2022 8:31 PM IST
Director Dasarath Enter Into Geetha Arts Compound
X

Geetha Arts: గీత ఆర్ట్స్ లో చేరిన మరొక ఫ్లాప్ డైరెక్టర్..

Movie News: ఒకప్పుడు మంచి హిట్ సినిమాల తో ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్లు ఈ మధ్యకాలంలో మాత్రం వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. చాలా త్వరగా మారుతున్న ప్రేక్షకుల ఇష్ట ఇష్టాలు దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందులాగా కాకుండా ప్రేక్షకులు ఇప్పుడు కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే చూడటానికి ఇష్టపడుతున్నారు. అభిమానులకు నచ్చేలాగా సినిమాలను తీయడానికి దర్శకులు తలకిందులు అవుతున్నారు.

ఈ నేపథ్యంలో చెప్పుకోవాల్సిన డైరెక్టర్ పేరు ఒకప్పుడు "సంతోషం", "మిస్టర్ పర్‌ఫెక్ట్" వంటి సూపర్ హిట్ సినిమాలు చేసి ఈ మధ్యకాలంలో ఎక్కడ మీడియా ముందు కనిపించడం తగ్గించిన దశరథ్. చివరిగా 2016లో శౌర్య అనే సినిమా చేసిన దశరథ్ ఆ తర్వాత మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్ళలేదు. నిజానికి ప్రభాస్ హీరోగా నటించిన "మిస్టర్ పర్‌ఫెక్ట్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దశరథ్ ఆ తర్వాత సంతోషం కాంబో రిపీట్ చేయాలని గ్రీకువీరుడు సినిమాకి దర్శకత్వం వహించారు కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత "శౌర్య" కూడా ఫ్లాప్ అవ్వడంతో దశరథ్ కెరీర్ కి బ్రేకులు పడ్డాయి.

రెండేళ్ళ పాటు దిల్ రాజు కాంపౌండ్ లోనే ఉన్న దశరథ్ కు అక్కడ కనీసం రైటర్ గా కూడా అవకాశం రాకపోవడంతో ఇపుడు గీతా ఆర్ట్స్ క్యాంప్ లో చేరిపోయాడు. ఫామ్ కోల్పోయిన దర్శకులకు కూడా మంచి కథ ఉంటే గీతా ఆర్ట్స్ లో అవకాశాలు దక్కుతున్నాయి. మరో వైపు సితార ఎంటర్టైన్మెంట్స్ లో కూడా కొన్ని స్టోరీ సిట్టింగ్స్ లో దశరథ్ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా మంచి కంటెంట్ ఇస్తే అవకాశం వచ్చే ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి దశరథ్ ఈ రెండు దారులను ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story