పవన్ కి షాకిచ్చిన 'ఇంద్ర' రచయిత

Ruthvik
Updated on: 24 March 2019 3:10 PM IST
పవన్ కి షాకిచ్చిన ఇంద్ర రచయిత
X

సమరసింహారెడ్డి', 'నరసింహారెడ్డి', 'ఇంద్ర' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలు అందించిన రచయిత చిన్నికృష్ణ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. వైకాపా పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్న ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. "హైదరాబాద్ లో ఆంధ్రా వాళ్లని పరిగెత్తిచ్చి మరీ కొడుతున్నారు. మన వాళ్లకి అక్కడ ఏమాత్రం రక్షణ లేదు. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ దూర్చకపోతే మంచిది. మాకు రిటర్న్ గిఫ్ట్ అక్కర్లేదు" అంటూ కృష్ణాజిల్లా ఎన్నికల ప్రచరంలో పవన్ కల్యాణ్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్ని కృష్ణ పవన్ కి రివర్స్ కౌంటర్ వేశారు.

"నేను నోరు తెరిస్తే పవన్ నవరంధ్రాలు మూసుకోవాల్పిందే. మీరు, మీ కుటుంబం ఏ పార్టీతో చేతులు కలిపారో ఆ పార్టీ సభ్యులందరికి కూడా పేరు పేరున చెబుతున్నాను.. నా నోరు తెరిపించే పనిచేయొద్దని హెచ్చరిస్తున్నాను" అంటూ చిన్నికృష్ణ షాకింగ్ కామెంట్లు చేశారు. " మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం హైదరాబాద్ లో వున్న ఆంధ్రుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జగన్ లాగేనే మీరూ కూడా పార్టీ పెట్టుకున్నారు. ప్రజలకు మీరేం చేస్తారో చెప్పండి కానీ జగన్ పై నిందలు ఎందుకు వేయడం? కోడి కత్తిపై విషం చిమ్ముతున్నారు. బాబాయ్ హత్య జరిగితే జగన్ పైనే నెట్టేసే ప్రయత్నం చేశారు. రేపు జగన్ తనకు తానే విషం తాగి చనిపోయాడని అంటారా?' అని నిలదీశారు చిన్నికృష్ణ.

Ruthvik

Ruthvik

Next Story