Buchi Babu - Mahesh: రెండో సినిమా కోసం నానా కష్టాలు పడుతున్న బుచ్చిబాబు

* మహేష్ బాబు ఒప్పుకున్నప్పటికీ సినిమా పట్టలెక్కలంటే కూడా చాలా సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది

admin1
Updated on: 22 Sept 2021 7:35 PM IST
Director Buchibabu Sana Struggling for the Second Movie to Start with Mahesh Babu
X

 మహేష్ బాబు - బుచ్చిబాబు (ఫోటో- ది హన్స్ ఇండియా ) 

Buchi Babu - Mahesh Babu New Movie: వైష్ణవ్ తేజ్ మరియు కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన "ఉప్పెన" సినిమా బ్లాక్ బస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందించిన ఈ దర్శకుడు రెండో సినిమాకి ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. కానీ ఆ సినిమా ఇంకా కార్యరూపం దాల్చలేదు.

ఎన్టీఆర్ ఒకవైపు "ఆర్ఆర్ఆర్" సినిమాతో బిజీగా ఉంటూనే మరోవైపు స్టార్ దర్శకుడు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో సినిమాలు సైన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం బుచ్చిబాబు మహేష్ బాబు తో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.

అయితే మహేష్ బాబు కూడా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు పరుశురాం దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమా తో బిజీగా ఉన్న మహేష్ బాబు ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఒప్పుకున్నప్పటికీ సినిమా పట్టలెక్కలంటే కూడా చాలా సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. మొదటి సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ రెండో సినిమా మొదలు పెట్టడానికి బుచ్చిబాబు చాలా కష్టాలు పడుతున్నారు.

admin1

admin1

Next Story