Buchi Babu New Movie: యువహీరో వేటలో పడిన బుచ్చిబాబు..!?

* ఎన్టీఆర్ కంటే ముందు యువ హీరోతో సినిమా చేస్తా అంటున్న బుచ్చిబాబు

admin1
Updated on: 4 Sept 2021 9:30 PM IST
Director Buchi Babu Planning to do a new Movie With Young Hero Before Junior NTR Movie
X

దర్శకుడు బుచ్చి బాబు

Buchi Babu New Movie: స్టార్ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ గా ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు సనా ఈ మధ్యనే "ఉప్పెన" అనే సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు అందరి దృష్టిని ఆకర్షించారు. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు రెండవ సినిమా కోసం ఎన్టీఆర్ ని ఒప్పించి అందరికీ షాకిచ్చాడు. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టిఆర్ బుచ్చిబాబుతో సినిమాని పట్టాలెక్కించలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేసే కంటే ముందు ఒక యువ హీరోతో సినిమా పూర్తి చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఒక యువ హీరో కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి బుచ్చిబాబు తన రెండో సినిమా ఎవరితో చేస్తారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏదేమైనా బుచ్చిబాబు మూడవ సినిమా మాత్రం ఎన్టీఆర్ తోనే ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ మరి కొన్ని సూపర్ హిట్ లు అందుకునే దాకా బుచ్చిబాబుకి స్టార్ స్టేటస్ రాదనే చెప్పాలి. మరి బుచ్చిబాబు తన తదుపరి సినిమాలతో ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటారో వేచి చూడాలి.

admin1

admin1

Next Story