Multi Starrer: ఇండియన్‌ స్క్రీన్‌పై భారీ మల్టీస్టారర్‌.. పెద్ద స్కెచ్‌ వేస్తున్న అట్లీ..!

జవాన్‌ మూవీతో తన సత్తా ఏంటో దేశ వ్యాప్తంగా చాటిన అట్లీ ఇప్పుడు మరో భారీ మల్టీ స్టారర్ మూవీకి ప్లాన్‌ చేస్తున్నాడు. అటు నార్త్‌, ఇటు సౌత్‌ ఇండస్ట్రీలను కలుపుతూ ఈ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Sept 2024 1:30 PM IST
Director Atlee Planning Huge Multi Starrer Movie With Salman Khan and Kamal Hasan
X

Multi Starrer: ఇండియన్‌ స్క్రీన్‌పై భారీ మల్టీస్టారర్‌.. పెద్ద స్కెచ్‌ వేస్తున్న అట్లీ..!

Salman Khan and Kamal Hasan: మల్టీ స్టారర్‌ మూవీస్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా అగ్ర హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానులు పండగా చేసుకుంటారు. ఇద్దరు హీరోల అభిమానులతో కిక్కిరిసి పోవడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రెండు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన హీరోలతో మల్టీ స్టారర్‌ మూవీ ప్లాన్‌ చేస్తే ఎలా ఉంటుంది.? అచ్చంగా అలాంటి ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే పనిలో పడ్డాడు దర్శకుడు అట్లీ.

జవాన్‌ మూవీతో తన సత్తా ఏంటో దేశ వ్యాప్తంగా చాటిన అట్లీ ఇప్పుడు మరో భారీ మల్టీ స్టారర్ మూవీకి ప్లాన్‌ చేస్తున్నాడు. అటు నార్త్‌, ఇటు సౌత్‌ ఇండస్ట్రీలను కలుపుతూ ఈ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇందుకోసం అగ్ర హీరోలైన సల్మాన్‌ ఖాన్‌, కమల్‌హాసన్‌ను బరిలోకి దించుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ ఈ సినిమాకు సంబంధించి సల్మాన్, కమల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇద్దరూ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అత్యంత భారీ బడ్జెట్‌తో మునుపెన్నడూ చూడని విధంగా భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు అట్లీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ నుంచి ప్రీప్రొడక్షన్‌ పనులు ప్రారంభించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీలో ఎలాంటి వండర్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story