Anudeep: మళ్లీ ఆ నిర్మాత తో నే పని చేయాలనుకుంటున్న అనుదీప్

Director Anudeep Movie in Suresh Productions | Tollywood News Online
x

సురేష్ ప్రొడక్షన్స్ తో పనిచేయనున్న "జాతిరత్నాలు" డైరెక్టర్

Highlights

Anudeep: సురేష్ ప్రొడక్షన్స్ తో పనిచేయనున్న "జాతిరత్నాలు" డైరెక్టర్

Anudeep: "జాతి రత్నాలు" వంటి ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ తో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ అనుదీప్ KV. 2021లో అత్యధిక 21న విడుదలైంది సినిమాలలో పెట్టిన బడ్జెట్ కి అత్యధిక ప్రాపర్టీ తీసుకు వచ్చిన సినిమాలలో "జాతి రత్నాలు" కూడా ఒకటి. తాజా సమాచారం ప్రకారం అనుదీప్ ప్రస్తుతం ఒక ద్విభాషా సినిమా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే "వరుణ్ డాక్టర్" అనే సినిమాతో తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్న తమిళ్ హీరో శివ కార్తికేయన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత తన మూడవ సినిమాని కూడా నాగ అశ్విన్ నిర్మాణంలో చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

కానీ అనుదీప్ మాత్రం తనకి మొట్టమొదటి సినిమా అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత తోనే పని చేయాలని అనుకుంటున్నాడట. నిజానికి షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా కూడా పని చేశారు. అతని టాలెంట్ ని గుర్తించిన సురేష్ బాబు 2016లో "పిట్టగోడ" ద్వారా దర్శకుడిగా పరిచయం చేశారు. కానీ ఆ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. ఇక నాగ్ అశ్విన్ సపోర్టుతో "జాతి రత్నాలు" సినిమా చేసిన అనుదీప్ మళ్లీ సురేష్ బాబు తో పని చేయడానికి సిద్ధమయ్యారు. అదే ఇప్పుడు అనుదీప్ చేయనున్న ద్విభాషా సినిమా. L ఏషియన్ సినిమాస్, శాంతి టాకీస్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories