అనుదీప్ కే వీ కి "ప్రిన్స్" రూపంలో యాసిడ్ టెస్ట్

Anudeep K.Vs survival in the industry
x

అనుదీప్ కే వీ కి రానున్న అసలు పరీక్ష

Highlights

KV Anudeep: శివకార్తికేయన్ హీరోగా ద్విభాష చిత్రంగా తెరకెక్కనున్న "ప్రిన్స్" సినిమా దీపావళికి హిట్ అవుతుందా?

KV Anudeep: "జాతి రత్నాలు" సినిమా పుణ్యమా అని చిత్ర డైరెక్టర్ అనుదీప్ కెవి పేరు ఇండస్ట్రీ లో బాగానే మారు మ్రోగింది. దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీ లోనే ఉన్న అనుదీప్ కు ఈ సినిమాతో మంచి బ్రేక్ లభించింది. కరోనా సమయంలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అప్పటిదాకా వెల వెలబోయిన బాక్స్ ఆఫీస్ కు కొత్త ఉత్సాహం తెచ్చింది. చిత్ర డైరెక్టర్ అనుదీప్ అయినప్పటికీ, చాలా వరకు సక్సెస్ క్రిడెట్ అంతా నవీన్ పోలిశెట్టి ఖాతాలోనే పడింది.

ఒక మామూలు కామెడీ కథని నవీన్ తన కామెడీ టైమింగ్ తో బ్లాక్ బస్టర్ చేశాడని అందరూ నవీన్ గురించే మాట్లాడారు. అయితే ఈ సినిమా తర్వాత అనుదీప్ ఖాతా లో ఒక ఫ్లాప్ పడింది. "ఫస్ట్ డే ఫస్ట్ షో" అనే సినిమాకి దర్శకత్వం వహించింది అనుదీప్ కానీ సినిమా ఫస్ట్ డే నే థియేటర్ లో నుండి వెళ్ళిపోయింది. అయితే తాజాగా ఇప్పుడు అనుదీప్ "ప్రిన్స్" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. శివకార్తికేయన్ హీరోగా ద్విభాష చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి ఆదరణ లభించింది.

కానీ ఇది పక్కా తమిళ సినిమానే. అందరూ తమిళ నటులే. శివకార్తికేయాన్ సినిమాలు కొన్ని తెలుగులో పర్వాలేదనిపించాయి. "ప్రిన్స్" ట్రైలర్ కూడా అనుదీప్ మార్క్ డైలాగుల తో బాగానే అనిపించింది. తమన్ సంగీతం కూడా సినిమాకి బాగానే ప్లస్ అయ్యేలా ఉంది. కానీ దీపావళికి సర్దార్, జిన్నా, ఓరిదేవుడా అంటూ బోలెడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ పోటిని తట్టుకొని "ప్రిన్స్" నిలబడాలి. అదే అనుదీప్ కి అసలు పరీక్ష. మరి ఈ పరీక్ష లో అనుదీప్ ఎంతవరకు హిట్ అందుకుంటారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories