"జాతి రత్నాలు" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా?

"జాతి రత్నాలు" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా?

Rama Rao
Published on: 3 Nov 2022 6:31 AM IST
Director Anudeep is Planning a Film with Ram Pothineni | Tollywood News
X

"జాతి రత్నాలు" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితోనో తెలుసా?

Anudeep KV: "జాతి రత్నాలు" సినిమాతో అనుదీప్‌ కే వీ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన సెన్సాఫ్ హ్యూమర్ తో సినిమాకి బాగానే హైప్ తెచ్చిన అనుదీప్ సినిమాతో కూడా చాలా బాగా ప్రేక్షకులను అలరించారు. అదే జోరుతో ఇప్పుడు తన రెండవ సినిమా "ప్రిన్స్" తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. తమిళ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ భాషల్లో విడుదలైంది.

ఆ సినిమాలో కూడా తనదైన శైలిలో కామెడీని బాగానే పండించారు అనుదీప్‌. కానీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో హిట్ అవలేదు. అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అనుదీప్ కి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే మూడు ప్రముఖ నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు అనుదీప్. త్వరలోనే తన మూడవ సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎవరు హీరోగా నటించనున్నారు అని ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే తాజా సమాచారం ప్రకారం అనుదీప్ దగ్గర యువ హీరో రామ్ కి సరిపడే ఒక కథ ఉందట. రామ్ కూడా అనుదీప్ తో సినిమా చేయడానికి బాగానే ఉత్సాహం చూపిస్తున్నారు. పైగా రామ్ కి రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్ బాగా కలిసి వచ్చింది. అది జొన్నర్ లో ఇప్పుడు అనుదీప్ కూడా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక అనుదీప్ తో సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story