మహేష్ డైరెక్టర్ కి వెయిటింగ్ కష్టాలు?

మహేష్ డైరెక్టర్ కి వెయిటింగ్ కష్టాలు?
x

anil ravipudi

Highlights

Anil Ravipudi : సినీ ఇండస్ట్రీలో హిట్ కొట్టడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత సినిమా ఏంటి అన్నది కూడా అంతే ముఖ్యం.. ఈ విషయంలో

Anil Ravipudi : సినీ ఇండస్ట్రీలో హిట్ కొట్టడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత సినిమా ఏంటి అన్నది కూడా అంతే ముఖ్యం.. ఈ విషయంలో పూరి జగన్నాథ్ తర్వాతే ఎవరైనా.. సినిమా షూటింగ్ లో దశలో ఉండగానే మరో సినిమాని అనౌన్స్ చేస్తాడు పూరి.. ఇంకా ఆ రేంజ్ లోకి మన దర్శకులు ఎవరు చేరుకోలేదు అని చెప్పాలి.. ఇక ఇది ఇలా ఉంటే పటాస్ సినిమాతో డైరెక్టర్ గా మారి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుస హిట్లు కొట్టి రాజమౌళి, కొరటాల శివ సరసన చేరాడు అనిల్ రావిపూడి..

ఇక ఈ ఏడాది మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. అయితే అనిల్ నెక్ట్ సినిమా ఏంటి అన్న దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు.. ఎఫ్ 2కి సీక్వెల్ చేయాలని స్క్రిప్ట్ కూడా రెడి చేసుకున్నాడు అనిల్.. అయితే వెంకటేష్, వరుణ్ తమతమ సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా కొంచం ఆలస్యం అయ్యేలా ఉంది.. ఈ క్రమంలో ఇద్దరు హీరోలతో నాలుగు స్థంభాలాట చేసేద్దామని అనుకున్నాడు. దీనికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తాడని టాక్ వచ్చింది. ప్రస్తుతం త్రినాథరావు నక్కిన రవితేజతో సినిమాని చేసే ప్లాన్ లో ఉన్నాడని సమాచారం..

దీనితో మళ్లీ ఎఫ్3 పైన అనిల్ పూర్తి ఫోకస్ పెట్టాడు.. దీని తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాల్సి ఉంది.. అటు మహేష్ చేతిలో వంశీ పైడిపల్లి, రాజమౌళి లాక్ అయిపోయారు. భీష్మ దర్శకుడు కూడా మహేష్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్.. దీనితో ఎఫ్3 తరవాత మళ్లీ అనిల్ వెయిట్ చేయాల్సిందేనా అనిపిస్తుంది. ఇండస్ట్రీకి వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన అనిల్ కూడా కష్టాలు తప్పడం లేదు అంటే ప్లాపుల్లో ఉన్న దర్శకుల సంగతి ఏంటో అర్ధం చేసుకోవచ్చు..

Show Full Article
Print Article
Next Story
More Stories