మహేష్ సినిమాకి భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకోనున్న దర్శకుడు

మహేష్ సినిమాకి భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకోనున్న దర్శకుడు
x
Highlights

ఇప్పటిదాకా కెరీర్ లో ఒక్క డిజాస్టర్ కూడా అందుకొని దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకడు. 'పటాస్' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి మొదటి...

ఇప్పటిదాకా కెరీర్ లో ఒక్క డిజాస్టర్ కూడా అందుకొని దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకడు. 'పటాస్' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక వరుసగా 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' సినిమాలతో సూపర్ హిట్ ను అందుకున్న అనిల్ రావిపూడి ఈ మధ్యనే విడుదలైన 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ తరువాత టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ ల లో అనిల్ రావిపూడి ఒకడి గా మారిపోయాడు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. అసలే మహేష్ స్టార్ లాంటి స్టార్ హీరోతో సినిమా, పైగా ముందు దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ లు, ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తన రెమ్యునరేషన్ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు సినిమా కోసం అనిల్ రావిపూడి అక్షరాల 12 కోట్లను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది నిజంగానే చాలా పెద్ద మొత్తం అని చెప్పుకోవచ్చు. కానీ ఫార్మ్ లో ఉన్న దర్శకుడు కాబట్టి నిర్మాతలు కూడా అడిగిన మొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories