Balakrishna: బాలయ్య కోసం స్క్రిప్ట్ పనుల్లో పడ్డ స్టార్ డైరెక్టర్

Director Anil Ravipudi Preparing the Script for Balakrishna
x

బాలకృష్ణ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి (ఫైల్ ఇమేజ్)

Highlights

Balakrishna: బాలకృష్ణ ప్రాజెక్టు పై ఫోకస్ పెట్టనున్న అనిల్ రావిపూడి

Balakrishna: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మధ్యనే తన తదుపరి సినిమా అయిన "ఎఫ్ 3" షూటింగ్ని పూర్తి చేశారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహరీన్ లు హీరో హీరోయిన్లుగా నటించిన "ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు అనిల్ రావిపూడి తన మొత్తం ఫోకస్ తన తదుపరి సినిమా పైనే పెట్టబోతున్నాడు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణ సినిమా కోసం ఒక మంచి స్క్రిప్ట్ని ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉన్నారు.

ఎప్పటినుంచో బాలకృష్ణ తో సినిమా చేయాలని అనుకుంటున్నారు అనిల్ రావిపూడి. ఇన్నాళ్లకి ఆయన కల నెరవేరబోతోంది. అందుకే ఈ సినిమా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు అనిల్. ఇక ఈ సినిమా లో బాలకృష్ణ మార్క్ యాక్షన్ సన్నివేశాలు మరియు అనిల్ రావిపూడి కామెడీ రెండూ ఉంటాయని సమాచారం. అందుకే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నటీనటులు మరియు ఇతరత్రా వివరాలు త్వరలో విడుదల కాబోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories