Mahesh - Anil: ప్రిన్స్ తో మరొక సినిమా అప్పుడే అంటున్న అనిల్ రావిపూడి

admin1
Published on: 9 Aug 2021 1:18 PM IST
Director Anil Ravipudi Planning to New Movies With Mahesh Babu And Balakrishna
X

మహేష్ బాబుతో అనిల్ రావిపూడి (ట్విట్టర్ ఫోటో)

Mahesh Babu - Anil Ravipudi : చేసినవి కొన్ని సినిమాలే అయినా అన్ని సూపర్ హిట్ లే. ఒకవైపు కథ ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఇస్తూనే కామెడీ కి ఏమాత్రం కలవకుండా చూసుకునే దర్శకుడు అనిల్ రావిపూడి. "రాజా ది గ్రేట్", "సరిలేరు నీకెవ్వరు" వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ దర్శకుడు ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమాలతో బిజీగా ఉన్నారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ అయిన "ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్" సినిమాకి సీక్వెల్ గా మూడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "ఎఫ్ 2"సినిమాలో నటించిన వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్ మెహరీన్ ఈ సినిమాలో కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అయితే తాజాగా తన తదుపరి సినిమాల గురించి రియాక్ట్ అయిన అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తను త్వరలోనే నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు అనిల్ రావిపూడి రివీల్ చేశారు. అంతేకాకుండా "సరిలేరు నీకెవ్వరు" తో ఇప్పటికే మహేష్ బాబుకి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి కి ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు సినిమాకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. మహేష్ బాబు డేట్ కు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అనిల్ రావిపూడి తేల్చి చెప్పారు.

admin1

admin1

Next Story