Anil Ravipudi New Film : అనిల్ రావిపూడి 'నాలుగు స్తంభాలాట'?

Anil Ravipudi New Film : కందిరీగ, మసాలా, ఆగడు సినిమాలకి మాటల రచయితగా పనిచేసి పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్

Krishna
Published on: 21 Aug 2020 10:29 AM IST
Anil Ravipudi New Film : అనిల్ రావిపూడి నాలుగు స్తంభాలాట?
X

Anil Ravipudi (File Photo)

Anil Ravipudi New Film : కందిరీగ, మసాలా, ఆగడు సినిమాలకి మాటల రచయితగా పనిచేసి పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి.. చేసిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ కొట్టిన అనిల్ రావిపూడి ఆ తర్వాత సుప్రీమ్ , రాజా ది గ్రేట్ సినిమాలతో హైట్రిక్ కొట్టాడు. ఈ సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో అనిల్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాని తెరకెక్కించి భారీ కొట్టాడు అనిల్ రావిపూడి.. ఈ సినిమాతో మినిమం గ్యారెంటీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు..

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.. వెంకటేష్, వరుణ్ తేజ్ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలు అయిపోయాక ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించనున్నారు.. అయితే వాళ్లు ఖాళీ అయ్యే లోపు మరో సినిమాను అనిల్ ప్లాన్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. ఇద్దరు యంగ్ హీరోలతో మంచి కామెడీ స్క్రిప్ట్ ని రెడీ చేశారట అనిల్ రావిపూడి.. దీనికి 'నాలుగు స్తంభాలాట' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా సమాచారం..

ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పైన దిల్ రాజు నిర్మించానున్నారట.. ఇందులో సాయి ధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోలుగా నటించనున్నారని సమాచారం.. అయితే ఈ సినిమాకి అనిల్ రావిపూడి కేవలం కథ, కథనం, మాటలు మాత్రమే అందించనున్నారని 'నేను లోకల్' ఫేమ్ త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది..

Krishna

Krishna

Next Story