అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్న అనిల్ రావిపూడి

*అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్న అనిల్ రావిపూడి

Rama Rao
Updated on: 1 May 2022 7:00 PM IST
Director Anil Ravipudi is Working on his Dream Project with Balakrishna
X

అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. తీసేది కమర్షియల్ సినిమాలే కానీ ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేసి తన సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరించే సత్తా ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈమధ్యనే "ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్", "సరిలేరు నీకెవ్వరు" వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అయ్యారు అనిల్ రావిపూడి.

"ప్రస్తుతం బాలకృష్ణ గారితో నేను చేస్తున్న సినిమానే నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా ఒక డిఫరెంట్ జోనర్ లో ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉండబోతోంది" అంటూ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు అనిల్ రావిపూడి. ఆ సర్ప్రైస్ ఎలిమెంట్ ఏంటి? సినిమా కథ ఎలా ఉండబోతోంది వంటి విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి "ఎఫ్ 2" కి సీక్వెల్ అయిన "ఎఫ్ 3" తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 27 న విడుదల కాబోతోంది.

Rama Rao

Rama Rao

Next Story