ఎఫ్ 4 వచ్చేది అప్పుడే.. ఎవ‌రు ఉంటారో, ఎవ‌రు వెళ్తారో..?

Director Anil Ravipudi Gives Clarity About F4 Movie
x

ఎఫ్ 4 వచ్చేది అప్పుడే.. ఎవ‌రు ఉంటారో, ఎవ‌రు వెళ్తారో..?

Highlights

F4 Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహ్రీన్ పిర్జాదా హీరో హీరోయిన్లుగా నటించిన..

F4 Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహ్రీన్ పిర్జాదా హీరో హీరోయిన్లుగా నటించిన "ఎఫ్2: ఫన్ అండ్ ఫస్ట్రేషన్" సినిమాకి సీక్వెల్ గా ఈ మధ్యనే "ఎఫ్ 3" సినిమా థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అనిల్ రావిపూడి కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేస్తున్నారు. తాజాగా తమన్నాతో తనకి జరిగిన గొడవ గురించి కూడా నోరువిప్పిన అనిల్ రావిపూడి ఇప్పుడు "ఎఫ్ 4" సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. నిజానికి "ఎఫ్3" క్లైమాక్స్ లోనే సినిమాకి మరొక సీక్వెల్ ఉండబోతోంది అంటూ హింట్ ఇచ్చారు అనిల్.

"ఎఫ్ 4" తీసే ఆలోచన కచ్చితంగా ఉంది కానీ అది ఇప్పట్లో కాదు అని అన్నారు. మరో రెండేళ్ల తర్వాతే ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ గురించి వర్క్ చేస్తానని చెప్పారు అనిల్ రావిపూడి. మరి అందులో కూడా నటీనటులు వాళ్ళే ఉంటారా అని అడగగా అది అప్పుడు మాత్రమే చెప్పగలం అని అన్న అనిల్ రావిపూడి వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటారని అన్నారు. అయితే హీరోయిన్లుగా మాత్రం తమన్నా మరియు మెహరీన్ ఉండరని వేరే హీరోయిన్ను తీసుకునే అవకాశం ఉందని అన్నారు అనిల్ రావిపూడి.

Show Full Article
Print Article
Next Story
More Stories