Anil Ravipudi: మెగా హీరోలతో సినిమాల గురించి క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: చిరు, పవన్ తో సినిమాలు ఇంకా టాక్స్ లోనే ఉన్నాయి అంటున్న స్టార్ డైరెక్టర్

admin1
Published on: 25 Nov 2021 9:30 PM IST
Director Anil Ravipudi Gives a Clarity on Movies Mega Heros
X

మెగా హీరోలతో సినిమాల పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి (ఫైల్ ఇమేజ్)

Anil Ravipudi: వరుస హిట్ సినిమాలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్నారు యువ డైరెక్టర్ అనిల్ రావిపూడి. కామెడీకి పెద్దపీట వేస్తూ సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ప్రతి సినిమాతో అభిమానుల అంచనాలకు మించి అలరిస్తూ సూపర్ హిట్ లను అందుకుంటున్నారు. ఈ మధ్యనే "సరిలేరు నీకెవ్వరు" సినిమా తో మరొక బ్లాక్బస్టర్ ని అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు "ఎఫ్ 3" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మరియు మెహరీన్ ముఖ్య పాత్రలు పోషించిన "ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఇక ఈ సినిమానే కాకుండా బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. తాజాగా అనిల్ రావిపూడి మెగా హీరోలతో కూడా సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. చిరంజీవి గారి సినిమా టాక్స్ లో ఉందని, పవన్ కళ్యాణ్ గారి తో సినిమా కూడా టాక్స్ లోనే ఉంది అని అన్నారు అనిల్ రావిపూడి. ఇందులో ఏ ఒక్క సినిమా కన్ఫర్మ్ అయినా అనిల్ రావిపూడి కూడా మెగా క్యాంప్ లో చేరి పోయినట్లే.

admin1

admin1

Next Story